హైకోర్టు జడ్జీపై అనుచిత వ్యాఖ్యలు.. కన్నడ సినీ నటుడు చేతన్ అరెస్ట్
- హిజాబ్ కేసు విచారిస్తున్న న్యాయమూర్తిపై చేతన్ అనుచిత వ్యాఖ్యలు
- ట్వీట్ ఆధారంగానే చేతన్‌పై కేసు నమోదు
- పోలీస్ స్టేషన్ ముందు చేతన్ మద్దతుదారుల ఆందోళన
కర్ణాటకలో వరుసగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదం కర్ణాటకను ఊపేస్తోంది. నిన్నటికి నిన్న భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కూడా పెను దుమారమే రేపింది. తాజాగా కర్ణాటక హైకోర్జు జడ్జీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా కన్నడ సినీ నటుడు చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హిజాబ్ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు జడ్జిపైనే చేతన్ అనుచిత వ్యాఖ్యలు చేశారట. హిజాబ్ వివాదంపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు చేతన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చేతన్ అరెస్ట్‌కు సంబంధించి కర్ణాటకలో మరో కొత్త వివాదం తలెత్తే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు , కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే చేతన్‌ను అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. మరోవైపు చేతన్‌పై కేసు నమోదు చేసిన శేషాద్రిపురం పోలీసుస్టేషన్ బయట అతడి మద్దతుదారులు ఆందోళనకు దిగారు.