రేపు అనుచ‌రుల‌తో జ‌గ్గారెడ్డి కీల‌క భేటీ

  • టీపీసీసీ చీఫ్ రేవంత్ వైఖరిపై విమ‌ర్శ‌లు
  • స‌రిదిద్ద‌క‌పోతే పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌
  • అందుకు గ‌డువు కూడా విధించిన జ‌గ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు (గురువారం) తెలంగాణ‌లో ఓ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి(జ‌గ్గారెడ్డి) త‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారుల‌తో గురువారం నాడు ఓ కీల‌క భేటీని నిర్వ‌హిస్తున్నారు. సంగారెడ్డిలో జ‌ర‌గ‌నున్న ఈ భేటీ తర్వాత ఆయ‌న త‌న  భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్న రీతిలో సాగుతున్న జ‌గ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి వ‌చ్చాక అస‌లు పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల‌నే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. క‌నీసం ఆయా ప్రాంతాల్లో పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆయా ప్రాంతాల నేత‌ల‌కు ఆహ్వానం ఉండ‌టం లేద‌ని కూడా జ‌గ్గారెడ్డి ‌బాహాటంగానే విమ‌ర్శ‌లు చేశారు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి మార‌క‌పోతే పార్టీకి తాను రాజీనామా చేస్తానంటూ ఇదివ‌ర‌కే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అందుకు గ‌డువును కూడా ప్ర‌క‌టించారు. ఈ గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రేపు త‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారుల‌తో ఆయన భేటీ కానున్నారు.


More Telugu News