సీబీఐ అధికారి రాంసింగ్ పై తదుపరి చర్యలొద్దు: కడప జిల్లా పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు
- రాంసింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు
- కడప ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో రాంసింగ్‌పై కేసు
- ఈ కేసును హైకోర్టులో సవాల్ చేసిన రాంసింగ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందంలోని ఏఎస్పీ రాంసింగ్‌పై తదుపరి చర్యలేమీ తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు కడప జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కడప ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో రాంసింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అయితే కడప జిల్లా పోలీసులు తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రాంసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. రాంసింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసు విచారణలో తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.