'డాన్‌'తో సంబంధాలు.. 'మ‌హా' మంత్రి న‌వాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసిన ఈడీ

  • ఉద్ధ‌వ్ థాకరే కేబినెట్‌లో మంత్రిగా న‌వాబ్ మాలిక్‌
  • దావూద్‌తో సంబంధాల ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ 
  • ఈడీ చ‌ర్య‌పై శివ‌సేన‌, ఎన్సీపీ ఆగ్ర‌హం
ముంబై బాంబు పేలుళ్ల సూత్ర‌ధారి, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంతో సంబంధాలున్నాయన్న ఆరోప‌ణ‌ల‌తో ఎన్సీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. బుధ‌వారం ఉద‌యం న‌వాబ్ మాలిక్ ఇంటికి వ‌చ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆయనను అరెస్ట్ చేసింది. ఆ త‌ర్వాత మాలిక్‌ను త‌మ కార్యాల‌యానికి తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్క‌డే ఆయ‌న‌ను విచారిస్తున్నారు. మ‌రోవైపు న‌వాబ్ మాలిక్ ఇల్లు, కార్యాల‌యాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది.

ఉద్ధ‌వ్ థాకరే కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న న‌వాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేయ‌డంపై ఇటు శివ‌సేన‌తో పాటు, అటు దాని మిత్ర‌ప‌క్షం ఎన్సీపీ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 2024 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మిమ్మ‌ల్ని మేం విచారిస్తామంటూ కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఉద్దేశించి శివ‌సేన ఎంపీ సంజయ్ రౌత్ సంచ‌లన వ్యాఖ్యలు చేశారు.


More Telugu News