టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి పోలీసులు వచ్చిన వీడియోను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించిన లోకేశ్
- అయ్యన్న పాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడారు
- కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు
- వైసీపీ నేతలు మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి
- బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయన్న లోకేశ్
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'మా అయ్యన్న పాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే.. వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి. ఉచ్ఛనీచాలు మరచి వైసీపీ నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయి.
వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు జిల్లాలు దాటి మరీ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత. పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు, బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారు అని సవాల్ చేస్తున్న వైసీపీ నేతలపై.. పోలీసులు తమ ప్రతాపాన్ని చూపి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గారిపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.