అయ్యన్నపాత్రుడి ఇంటికి పోలీసులు.. ఇంట్లో ఆయన లేరని చెప్పిన కార్యకర్తలు.. ఉన్నారంటోన్న పోలీసులు
- జగన్ ను దూషించారనే ఆరోపణలతో అయ్యన్నపై కేసు
- నోటీసులు ఇచ్చి వెళ్తామంటోన్న పోలీసులు
- భారీగా చేరుకుంటోన్న కార్యకర్తలు
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత సభలో జగన్ ను దూషించారని ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు అంటున్నారు.
ఆయనను అరెస్టు చేస్తారన్న సందేహాల మధ్య టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు చెప్పారు. అయితే, ఆయన ఇంట్లోనే ఉన్నారని నోటీసులు ఇచ్చే వెళ్తామని పోలీసులు అంటున్నారు. పోలీసుల బృందంలో సీఐ రఘుతో పాటు ఎస్సైలు శ్రీహరిరావు, అవినాశ్ కూడా ఉన్నారు. కాగా, గతంలోనూ అయ్యన్నపై పోలీసులు వేరే విషయంపై కేసు నమోదు చేశారు.