కాసేపట్లో మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు
- మరో మైలురాయికి చేరుకుంది
- కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు
- ప్రాజెక్ట్‌కు కేంద్రం ఎంత వరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారంటూ కేటీఆర్ ప్రశ్న
కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాసేపట్లో ఆయన సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ చేరుకుని, అక్కడి పంపుహౌస్‌ను పరిశీలించి మోటార్లు ఆన్ చేస్తారు.
17,600 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. దీని ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలకు వాడతారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక మల్లన్న సాగర్ ప్రారంభిస్తోన్న వేళ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేసి, కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయికి చేరుకుందని, దానిలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నేడు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారు? అని ట్విట్టర్‌లో కేటీఆర్ ప్రశ్నించారు.