మెరుపు వేగంతో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో పోస్ట్ చేస్తూ, రేవంత్ రెడ్డి అభినందన
- వరంగల్ రైల్వే స్టేషన్ లో ఘటన
- కదులుతోన్న రైలు నుంచి దూకిన మహిళ
- కానిస్టేబుల్ చిన్నరామయ్యపై ప్రశంసల జల్లు
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కదులుతోన్న రైలు నుంచి ఓ మహిళ దూకేయడంతో ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడబోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి ఆమెను కాపాడాడు.
కృష్ణా ఎక్స్ ప్రెస్ లో ఆ మహిళ తిరుపతి నుంచి వరంగల్ వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ చిన్నరామయ్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చిన్న రామయ్యను అభినందిస్తూ ఆయన చేసిన సాహసానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
'వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు నడుస్తున్న రైలు కింద జారిపడిపోయిన పార్వతి అనే మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన పీఆర్ఎఫ్ కానిస్టేబుల్ చిన్న రామయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రామయ్య... మీరు నిజమైన హీరో' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.