ఢిల్లీ చేరుకున్న 20 మంది తెలంగాణ బీజేపీ నేతలు.. తరుణ్‌చుగ్ నివాసంలో సమావేశం

  • బండి సంజయ్, డీకే అరుణ సహా ఢిల్లీకి 20 మంది నేతలు
  • తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
  • బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ చానల్, పేపర్‌పై ఫిర్యాదు!
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా 20 మంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో వీరంతా సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ దూకుడు తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, బీజేపీపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలపైనా కూడా చర్చించే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ కౌంటర్ ఎజెండా పైనా చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ చానల్, పేపర్‌పైనా ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉభయ సభల కార్యదర్శులకు వినతిపత్రం సమర్పించే అవకాశం ఉంది.


More Telugu News