శ్రీలంకతో సిరీస్‌కు చాహర్ దూరం
- వెస్టిండీస్‌తో ఆఖరి టీ20లో చాహర్‌కు గాయం
- కోలుకునేందుకు 5 నుంచి 6 వారాలు పడుతుందన్న వైద్యులు
- లంకతో సిరీస్‌కు జట్టులో చోటు దక్కినా.. గాయంతో దూరమైన వైనం
- ఇప్పటికే బయోబబుల్ వీడినట్టు సమాచారం
శ్రీలంకతో సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. ఇప్పటికే అతడు బయోబబుల్‌ను వీడాడని సమాచారం. లంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాహర్ సభ్యుడిగా ఉన్నాడు.
వెస్టిండీస్‌తో ఆఖరి టీ20 సందర్భంగా చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండో ఓవర్ బౌలింగ్ చేస్తుండగా కుడి తొడ కండరాలు పట్టేయడంతో చాహర్ మైదానాన్ని వీడాడు. వైద్యుల పరీక్ష అనంతరం గాయం తీవ్రమైందని తేలింది. కోలుకునేందుకు 5-6 వారాలు పడుతుందని వైద్యులు చెప్పినట్లుగా సమాచారం.
లంకతో టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది. లక్నో వేదికగా తొలి టీ20, ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరు వేదికగా రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది.