వెండితెరకు పరిచయం కానున్న షారుఖ్ తనయుడు... హీరోగా కాదు!
- అమెరికాలో ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సు చేసిన ఆర్యన్ ఖాన్
- త్వరలోనే కథా రచయితగా సినీ రంగ ప్రవేశం
- ఓ వెబ్ సిరీస్ తో పాటు, సినిమాకు కథ సమకూర్చనున్న ఆర్యన్
ఇటీవలే డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపించడం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం బెయిల్ పై బయటున్నాడు. కాగా, ఆర్యన్ ఖాన్ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. అయితే హీరోగా మాత్రం కాదు. షారుఖ్ తనయుడు ఓ రచయితగా వినోద రంగంలో ప్రవేశించనున్నాడు.
ఆర్యన్ ఖాన్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే కెమెరా ముందుకొచ్చే బదులు, తనలోని క్రియేటివిటీని చాటుతూ కలంతో కొత్త కథలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.
త్వరలోనే ఓటీటీ వేదిక కోసం ఓ వెబ్ సిరీస్ కు కథ అందించనున్నాడు. అంతేకాదు, ఓ సినిమాకు కూడా రైటర్ గా వ్యవహరించనున్నాడు. ఆ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఆర్యన్ కథ అందించే వెబ్ సిరీస్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. కాగా, ఈ ప్రాజెక్టుల కోసం ఆర్యన్... బిలాల్ సిద్ధిఖీ నుంచి రచనా సహకారం అందుకోనున్నాడు.