తేజ డైరెక్టర్ గా భారీ ప్రాజెక్ట్ .. 18వ శతాబ్దం నాటి కథతో 'విక్రమాదిత్య'
- ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా తేజ
- విభిన్నమైన కథలతోను విజయం
- తాజా చిత్రంగా రానున్న 'అహింస'
- 'విక్రమాదిత్య'తో త్వరలో సెట్స్ పైకి
ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో తేజ సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన 'చిత్రం' .. 'జయం' వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో ఆయన విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన నుంచి వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' విజయాన్ని నమోదు చేసింది.
ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'అహింస' సినిమా రూపొందుతోంది. దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను కూడా తేజ లైన్లో పెట్టాడు.
నల్లమలుపు బుజ్జి నిర్మాతగా తేజ 'విక్రమాదిత్య' అనే ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజు తేజ పుట్టినరోజు కావడంతో, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 1836 నాటి కాలంలో ఈ కథ నడుస్తుందనే విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు. .
ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'అహింస' సినిమా రూపొందుతోంది. దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను కూడా తేజ లైన్లో పెట్టాడు.
నల్లమలుపు బుజ్జి నిర్మాతగా తేజ 'విక్రమాదిత్య' అనే ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజు తేజ పుట్టినరోజు కావడంతో, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 1836 నాటి కాలంలో ఈ కథ నడుస్తుందనే విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.