ఈ సారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి రాములోరి కల్యాణం
- ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు
- 10న సీతారాముల కల్యాణం, 11న మహా పట్టాభిషేకం
- ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టికెట్ల విక్రయం
భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరగనుంది. ఏటా లక్షలాది మంది భక్తుల సమక్షంలో కోలాహలంగా సాగే రాములోరి కల్యాణం.. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా ఏకాంతంగానే సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో ఈ దఫా రాముల వారి కల్యాణాన్ని భక్తుల మధ్యే నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు భద్రాచలం ఈవో నుంచి అధికారికంగా నేడు ఓ ప్రకటన వెలువడింది.
ఏప్రిల్ 2 నుంచి 16వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 10న సీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహా పట్టాభిషేకం చేసి రథోత్సవం నిర్వహించనున్నారు. రాములవారి కల్యాణోత్సవానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లుగా భద్రాచలం ఈవో ప్రకటించారు.