ఆన్ లైన్ క్లాసుల సంగతి తర్వాత... ముందు ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోండి: విద్యార్థులకు మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
- ఉక్రెయిన్ పై యుద్ధ మేఘాలు
- సరిహద్దుల్లో మోహరించిన రష్యా
- యూనివర్సిటీల నుంచి ప్రకటన కోసం వేచిచూస్తున్న విద్యార్థులు
- స్పందించిన భారత ఎంబసీ
ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా ఉరుముతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఉక్రెయిన్ లో ఉంటున్న భారత విద్యార్థుల క్షేమం కోసం మరోసారి ప్రకటన జారీ చేసింది. విద్యార్థులెవరూ ఉక్రెయిన్ లో ఉండరాదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ క్లాసులపై మెడికల్ యూనివర్సిటీలు అధికారిక ప్రకటన చేసేంత వరకు ఆగొద్దని, వీలైనంత త్వరగా ఉక్రెయిన్ ను వీడాలని వివరించింది.
"మెడికల్ యూనివర్సిటీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేది, లేనిదీ తెలియడంలేదంటూ నిత్యం కీవ్ నగరంలోని భారత ఎంబసీకి విద్యార్థుల నుంచి లెక్కకు మిక్కిలిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం ముందే అప్రమత్తమైంది. సంబంధిత విద్యాసంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ఆన్ లైన్ క్లాసులపై సమాచారం వచ్చేంత వరకు విద్యార్థులు ఉక్రెయిన్ లోనే ఉండడం వారి క్షేమం దృష్ట్యా ఏమంత మంచిది కాదు. తాత్కాలికంగా ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోవడమే మంచిది. మెడికల్ యూనివర్సిటీల నుంచి ఏదైనా సమాచారం వస్తే వెంటనే తెలియపరుస్తాం" అంటూ కీవ్ లోని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.