రేపటి నుంచి మళ్లీ ఎగరనున్న ట్రూజెట్ విమానాలు
- ఈ నెల 5న నిలిచిన ట్రూజెట్ సేవలు
- నిధుల లేమి, సాంకేతిక సమస్యలే కారణం
- బుధవారం నుంచి సర్వీసుల పునఃప్రారంభం
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ భాగస్వామిగా ఉన్న ట్రూజెట్ తన విమాన సర్వీసులను మరోమారు ప్రారంభించనుంది. తన స్నేహితులతో కలిసి చెర్రీ ఈ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే నిధుల లభ్యత లేని కారణంగా ఈ నెల 5వ తేదీ నుంచి విమాన సర్వీసులను ట్రూజెట్ నిలిపివేసింది. తాజాగా కొంతమేర నిధులను సర్దుబాటు చేసుకున్న ఆ సంస్థ ఈ నెల 23 (బుధవారం) నుంచి తిరిగి తన విమాన సర్వీసులను పునఃప్రారంభించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
బుధవారం నుంచి ప్రారంభం కానున్న ట్రూజెట్ విమాన సర్వీసులు హైదరాబాద్–విద్యానగర్–హైదరాబాద్, విద్యానగర్–బెంగళూరు–విద్యానగర్, బెంగళూరు–బీదర్–బెంగళూరు, హైదరాబాద్–రాజమండ్రి–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్–హైదరాబాద్, ముంబై–నాందేడ్–ముంబై, ముంబై–కొల్హాపూర్–ముంబై, ముంబై–జల్గావ్–ముంబై రూట్లలో తిరగనున్నాయి. అంతేకాకుండా త్వరలోనే మరిన్ని రూట్లలోనూ తమ విమాన సేవలను అందించనున్నట్లుగా ట్రూజెట్ ఎండీ వి.ఉమేశ్ తెలిపారు.