తమిళనాడు పుర పోరులో డీఎంకే ఆధిపత్యం.. పోటీ రెండు పక్షాల మధ్యే
- నేటి ఉదయం నుంచి పోలింగ్
- మొత్తం 1,374 కార్పొరేషన్ వార్డులు
- డీఎంకేకు 57, ఏఐఏడీఎంకేకు 7
- మున్సిపల్ వార్డులు 3,848
- 248 చోట్ల డీఎంకే విజయం
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార డీఎంకే ఆధిపత్యం చూపించింది. ప్రధానంగా పోటీ డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యే నడిచింది. దశాబ్దం తర్వాత మొదటిసారిగా పురపాలక సంఘాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించారు.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే.. 1,374 కార్పొరేషన్ వార్డులకు గాను డీఎంకే 57 చోట్ల గెలుపొందింది. ఏఐఏడీఎంకే 7 స్థానాలను, ఇతరులు 8 స్థానాలను సొంతం చేసుకున్నారు. డీఎంకే భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ 7, సీపీఎం 2 కార్పొరేషన్ వార్డుల్లో గెలిచాయి.
మున్సిపాలిటీల్లో 3,843 వార్డులకు గాను డీఎంకే 248 చోట్ల విజయం సాధించింది. ఏఐఏడీఎంకే 79 చోట్ల, ఇతరులు 53 చోట్ల గెలుపొందారు. పట్టణ పంచాయతీల్లో 1,251 వార్డుల్లో డీఎంకే విజయం సాధించగా, ఏఐఏడీఎంకే 354 స్థానాలను సొంతం చేసుకుంది.