హైదరాబాద్ కాలుష్యంపై ఆసక్తికర అంశాలను వెల్లడించిన ఏక్యూఐ
- గాలి నాణ్యత ఎక్కువ రోజుల్లో మోస్తరుగానే
- 2021లో 155 రోజుల్లో ఇదే నమోదు
- 109 రోజుల్లో వాయు నాణ్యత మంచి స్థాయిలో
- దారుణ స్థాయికి ఇంకా చేరలేదు
హైదరాబాద్ లో కాలుష్యానికి సంబంధించిన ఆసక్తికరమైన గణాంకాలను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) రూపంలో కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021లో 155 రోజుల పాటు మోస్తరు వాయు నాణ్యత నమోదైంది. హైదరాబాద్ లో గడిచిన మూడేళ్లలో గాలి నాణ్యత మోస్తరుగా ఉండే రోజులు పెరిగాయి. వాయు నాణ్యతను 'బాగుంది, సంతృప్తిగా ఉంది, మోస్తరుగా ఉంది, బాగోలేదు, అస్సలు బాగోలేదు, దారుణంగా ఉంది' అనే వర్గాలుగా ఏక్యూఐ పేర్కొంది.
సంతోషకరమైన విషయం ఏమిటంటే.. వాయు నాణ్యత అస్సలు బాగోలేకపోవడం, దారుణంగా ఉండడం అన్నది హైదరాబాద్ లో నమోదు కాలేదు. 2019లో 76 రోజుల పాటు వాయు నాణ్యత బాగుంది అనే స్థాయిలో నమోదైంది. 2020లో 113 రోజుల్లో, 2021లో 109 రోజుల్లోనూ వాయు నాణ్యత బాగుంది.
ఏక్యూఐ వాయు నాణ్యతను 0 నుంచి 500 మధ్య స్కోరుతో పేర్కొంటుంది. 500 ఉంటే వాయు నాణ్యత అధ్వానంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 300 కంటే ఎక్కువ స్కోరు ఉంటే ఆరోగ్యానికి పెను ముప్పు ఉన్నట్టు.
కరోనాతో ఎక్కువ రోజుల పాటు లాక్ డౌన్ లు, ఆంక్షలు విధించిన 2020లో మోస్తరు వాయు నాణ్యత 95 రోజుల్లో నమోదు కాగా.. 2021లో 155 రోజుల్లో మోస్తరు స్థాయిలో ఉండడం గమనించాలి. 2019లో 154 రోజుల్లోనూ మోస్తరుగానే ఉంది.