34 పాస్‌లు.. తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య గోల్ వేసిన ఫుట్‌బాల్ జ‌ట్టు.. వీడియో వైర‌ల్‌

  • ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నార్విచ్‌ సిటీతో లివర్‌పూల్‌ టీమ్ మ్యాచ్
  • అరుదైన గోల్ వేసి అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంటోన్న లివ‌ర్‌పూల్
  • ఒక్కసారి కూడా ప్రత్యర్థి జ‌ట్టుకు బంతి చిక్కని వైనం
ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఆట ఫుట్‌బాల్‌. గోల్ వేయాలంటే ఫుట్‌బాల్ ఆట‌గాళ్లు ప‌డే క‌ష్టం అంతా ఇంతా కాదు. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌ను దాటుకుంటూ ఆట‌గాళ్లు గోల్ వేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న స‌మ‌యంలో ప్రేక్ష‌కుల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంటుంది. అయితే, ఈ గోల్‌ చేసే ముందు జ‌ట్టులోని ఆట‌గాళ్ల మ‌ధ్య 34 పాస్‌లు జరగ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది.

అంటే ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు ఫుట్‌బాట్ చిక్క‌కుండా ఓ జ‌ట్టులోని ఆటగాళ్లు త‌మ జ‌ట్టులోని వారికి బంతి చిక్కేలా స‌మ‌ర్థంగా ఆడ‌డం. ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నార్విచ్‌ సిటీతో జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్‌ టీమ్ ఇటువంటి అరుదైన గోల్ చేసి అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

గోల్‌ చేసే ముందు టీమ్‌లోని ఆట‌గాళ్ల మధ్య 34 పాస్‌లు జరిగాయి. ఒక్కసారి కూడా ప్రత్యర్థి జ‌ట్టుకు బంతి చిక్కలేదు. తీవ్ర ఉత్కంఠ‌తో ప్రేక్ష‌కులు ఊపిరిబిగ‌ప‌ట్టుకుని ఈ మ్యాచ్ చూశారు. లివర్‌పూల్‌ సిటీ టీమ్‌ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పంచుకుంది. చివ‌ర‌కు ఈ మ్యాచ్‌లో లివర్‌పూల్‌ టీమ్ గెలుపొందింది.


More Telugu News