పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఉక్రెయిన్ లో రెండు రాష్ట్రాలను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తించిన రష్యా!
- ఉక్రెయిన్ వద్ద అణుబాంబు ఉందని ఆరోపించిన పుతిన్
- రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని ఆగ్రహం
- రష్యాపై దాడికి తెగబడితే తిప్పికొడతామని హెచ్చరిక
ఓ వైపు ఉక్రెయిన్ పై యుద్ధం చేయబోమని చెపుతూనే మరోవైపు చేయాల్సిందంతా చేసేస్తోంది రష్యా. ఉక్రెయిన్ పై ఆ దేశ తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను సైతం రష్యా పట్టించుకోవడం లేదు.
అంతేకాదు తాజాగా ఉక్రెయిన్ లోని తిరుగుబాటు ప్రాంతాలైన డోనెట్క్స్, లుహాన్స్ లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తూ ఆయన సంతకాలు చేశారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రష్యా ప్రజలను ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రసంగిస్తూ... ఉక్రెయిన్ వద్ద అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్ని దేశాల సహకారంతో రష్యాపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ యత్నిస్తోందని అన్నారు. రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. రష్యాపై దాడికి తెగబడితే తిప్పికొడతామని హెచ్చరించారు.
మరోవైపు తమ రెండు రాష్ట్రాలను రష్యా స్వతంత్ర రాజ్యాలుగా గుర్తించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ సార్వభౌమత్వంలో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. ఇంకోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు అమెరికా, బ్రిటన్ దేశాలతో చర్చలు జరుపుతోంది.