చంద్రబాబు మాదిరే కేసీఆర్ క‌నుమ‌రుగు: బండి సంజ‌య్

  • కేసీఆర్ దోపిడీపై త్వ‌ర‌లోనే విచార‌ణ అంటూ ధ్వజం
  • ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే జాతీయ రాజ‌కీయాల‌ని ఎద్దేవా
  • దేశాన్ని కాపాడుతున్న‌ది మోదీనేన‌ని ఉద్ఘాట‌న‌
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ దోచుకున్న‌, దాచుకున్న డ‌బ్బుపై త్వ‌ర‌లోనే విచార‌ణ జ‌ర‌గ‌బోతోంద‌ని ఆయ‌న తెలిపారు. దేశాన్ని కాపాడుతున్న ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై అస‌త్య ప్ర‌చారం చేస్తున్న కేసీఆర్‌.. గ‌తంలో అదే ప‌ని చేసి అడ్రెస్ లేకుండాపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరే క‌నుమ‌రుగు కాక త‌ప్ప‌ద‌ని కూడా బండి సంజ‌య్ జోస్యం చెప్పారు.

జాతీయ రాజ‌కీయాల‌పై ఇటీవ‌ల వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న కేసీఆర్‌.. సోమ‌వారం నాడు సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ్ ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర‌, బ‌సవేశ్వ‌ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ స‌ర్కారుపై కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌లు విన్నంత‌నే కేసీఆర్‌పై బండి సంజ‌య్ ప్ర‌తిదాడికి దిగారు. కేసీఆర్ దోపిడీపై త్వ‌ర‌లో విచార‌ణ జ‌ర‌గ‌బోతోంద‌ని, దానిపై ప్ర‌జ‌ల దృష్టిని మర‌ల్చేందుకే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలంటూ డ్రామాలాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.


More Telugu News