ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
- రాజ్యాంగ సవరణతో మూడేళ్ల కిందటే కేంద్రం ఉత్తర్వులు
- కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
- ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్న
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లను అమలు చేయాలంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మూడేళ్ల కిందటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు 103 రాజ్యాంగ సవరణ చట్టం కూడా చేసింది. అయితే ఆ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదట. ఈ విషయాన్ని తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు బట్టబయలు చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమవారం ఓ లేఖ రాశారు. రాజ్యాంగానికి సవరణ చేసి మరీ అమలులోకి తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్‌ను కిషన్ రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. రాజ్యాంగానికి ఈ సవరణ చేసి మూడేళ్లు కావస్తున్నా.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరని కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించారు.