ఓ రోజు ముందుగానే ఐపీఎల్ సీజన్
- మార్చి 27న సీజన్‌ను మొదలుపెట్టేందుకు తొలుత నిర్ణయం
- స్టార్ ఇండియా కోరిక మేరకు 26న సీజన్ షురూ
- రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
ప్రపంచ క్రికెట్‌లో విశేషాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌కు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆటగాళ్ల వేలం పూర్తి కాగా.. వచ్చే నెల చివరలో ఈ సీజన్ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను మార్చి 27న ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న స్టార్ ఇండియా అభ్యర్థన మేరకు ఓ రోజు ముందుగానే సీజన్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధమైపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ముందుగా అనుకున్న మార్చి 27కు ఓ రోజు ముందుగా అంటే మార్చి 26న సీజన్‌ను మొదలుకానుంది. మార్చి 26వ తేదీ (శనివారం) లీగ్‌ను ప్రారంభిస్తే తర్వాతి రోజయిన ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు. అదే రోజు లీగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.