త్వరలోనే విశాఖకు రైల్వే జోన్: సోము వీర్రాజు
- వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ చీఫ్ విమర్శలు
- కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపణ
- ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌పై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ వస్తుందని ఆయన ప్రకటించారు. ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించిన సందర్భంగా సోమవారం నాడు ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తోందన్న వీర్రాజు.. ఆ నిధులను వైసీపీ సర్కారు నిర్దేశించిన పనులకు వాడకుండా దారి మళ్లిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులను ఆయా సంస్థల ఖాతాలకు పంపాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు నిధులను ఇతరత్రా పనులకు వాడుతోందని ఆరోపించారు. వేల కోట్ల నిధులను కేంద్రం విడుదల చేస్తున్నా.. రాష్ట్రం పట్ల మోదీ సర్కారు నిర్లక్ష్యం చూపుతోందంటూ జగన్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
కొత్త జిల్లాల వ్యవహారంపై స్పందించిన వీర్రాజు.. ప్రజాభీష్టం మేరకే జిల్లాల విభజన జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజల ఇష్టాఇష్టాలను పక్కనపెట్టి తమ సౌలభ్యాల మేరకే జిల్లాలను విభజించే యత్నాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ప్రజల డిమాండ్ల పరిశీలనకు ఓ ప్రత్యేక కమిటీని వేయాలని కూడా వీర్రాజు కోరారు.