ఏపీలో 182 కరోనా కేసులు... తాజా వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 14,249 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 70 కేసులు
- చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి
- ఇంకా 5,985 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 200కి దిగువన నమోదైంది. గడచిన 24 గంటల్లో 14,249 కరోనా పరీక్షలు నిర్వహించగా, 182 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 24 కేసులు గుర్తించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 950 మంది ఆరోగ్యవంతులు కాగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,95,768 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,985 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,714కి పెరిగింది.