గౌతమ్ రెడ్డి మరణం ఎంతో బాధను కలిగిస్తోంది: జగన్, కేవీపీ రామచంద్రరావు
- తొలినాళ్ల నుంచి సుపరిచితుడన్న జగన్
- యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోయానని ఆవేదన
- గౌతమ్ తనకు అత్యంత ఆప్తుడని చెప్పిన కేవీపీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరినీ దిగ్భాంతికి గురి చేస్తోంది. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముందు నుంచి కూడా జగన్ తో గౌతమ్ రెడ్డికి అనుబంధం ఉంది.
గౌతమ్ రెడ్డి మృతి పట్ల మాజీ పార్లమెంటు సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. రాజకీయాల్లో స్తబ్దుగా ఉండొద్దని, ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయాలని తనను కోరేవాడని తెలిపారు. ఎంతో ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉన్న గౌతమ్ చిన్న వయసులోనే ఆకస్మిక మరణానికి గురి కావడం బాధాకరమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో దివంగత రాజశేఖరరెడ్డికి, తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు.