దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య
- నిన్న దేశంలో 16,051 కరోనా కేసులు
- 206 మంది మృతి
- పాజిటివిటీ రేటు 1.93 శాతం
- మొత్తం మృతుల సంఖ్య 5,12,109
దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో 16,051 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అలాగే, కరోనా కారణంగా నిన్న 206 మంది మృతి చెందారని పేర్కొంది.
దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,02,131 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,21,24,284 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,109కి పెరిగింది.