శ్రీశైలంలో రేపటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు షురూ
- భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు
- విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతున్న పుణ్యక్షేత్రం
- సర్వదర్శనాల నిలిపివేత
- మార్చి 5వ తేదీ నుంచి తిరిగి మొదలు
మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీశైల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. రేపటి నుంచి బహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో వారి సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. పాతాళగంగ వద్ద షవర్లను ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యూలను ఏర్పాటు చేస్తున్నారు. ఇరుముడి సమర్పించేందుకు వచ్చే శివస్వాముల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు.
విద్యుద్దీపాలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వదర్శనాన్ని నిలిపివేశారు. నిజానికి నేటి వరకు సర్వదర్శనం వెసులుబాటు ఉండగా నిన్న భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సర్వదర్శనాన్ని నిలిపివేశారు. రూ. 500 ప్రత్యేక దర్శనాన్ని కూడా నిలిపివేయడంతో అధికారులపై భక్తులు మండిపడ్డారు. బ్రహ్మోత్సవాల అనంతరం మార్చి 5 నుంచి సర్వదర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి.