చివరి టీ20లో టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన వెస్టిండీస్
- ఇప్పటికే 2-0తో సిరీస్ భారత్ కైవసం
- నామమాత్రంగా మూడో టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్
- ఓపెనర్ గైక్వాడ్ వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో నేడు చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ ను చేజిక్కించుకోగా, ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ పోరులో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ 14 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. అతడికి జతగా శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నాడు. అయ్యర్ 3 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.