వెదురు సాగుతో సిరుల పంట

  • ఎకరాకు పెట్టుబడి రూ.20వేలు
  • ఆదాయం రూ.1-2 లక్షలు
  • తెలంగాణ ఉద్యానవన శాఖ అంచనా
  • థర్మల్ ప్లాంట్లలో వినియోగం
అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే వెదురుకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. థర్మల్ ప్లాంట్లు బొగ్గును మండించడం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయని తెలిసిందే. మన దేశంలో 75-80 శాతం విద్యుత్ బొగ్గు ఆధారంగానే తయారవుతోంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా విడుదల అవుతోంది. దీంతో విద్యుత్ ప్లాంట్లు కనీసం ఏడు శాతం మేర బొగ్గుకు బదులు వెదురు పిల్లెట్లను (చిన్న చిన్న ముక్కలు) వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

దీంతో ఇప్పుడు థర్మల్ ప్లాంట్లు వెదురు పిల్లెట్లను వినియోగించక తప్పదు. ఒక్క తెలంగాణలోనే విద్యుత్ ప్లాంట్లకు సుమారు 25 లక్షల టన్నుల మేర వెదురు బొంగులు కావాల్సి వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా. కనీసం లక్ష ఎకరాల్లో సాగు చేయడం ద్వారా అవసరాలు తీర్చుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. ఒక్కో ఎకరంలో వెదురుసాగుకు పెట్టుబడి రూ.20వేలు అవుతుందని.. ఆదాయం రూ.1-2 లక్షల వరకు వస్తుందని పేర్కొంది.


More Telugu News