దేశంలో 20 వేల‌ దిగువ‌కు చేరిన‌ రోజువారీ కరోనా కేసులు

  • నిన్న దేశంలో 19,968 క‌రోనా కేసులు
  • 673 మంది మృతి
  • రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతం
  • మొత్తం మృతుల సంఖ్య‌ 5,11,903
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 20 వేల‌కు దిగువ‌కు చేరింది. నిన్న దేశంలో 19,968 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 48,847 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 673 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప్ర‌స్తుతం క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,24,187 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,20,86,383 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య‌ 5,11,903కు చేరింది. మొత్తం 175,37,22,697 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.



More Telugu News