ర్యాలీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేదు అనుభవం.. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ యువత నినాదాలు

  • యూపీలోని గోండాలో బీజేపీ ఎన్నికల ర్యాలీ
  • ప్రసంగించేందుకు మైక్ వద్దకు రాగానే యువకుల నినాదాలు
  • త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి హామీ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నిరుద్యోగుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గోండాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మంత్రి మాట్లాడేందుకు మైక్ వద్దకు రాగానే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న యువకులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. ఆర్మీలో నియామకాలు చేపట్టాలని, డిమాండ్లను నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. స్పందించిన మంత్రి రాజ్‌నాథ్ ఆందోళన వద్దని త్వరలోనే నియమాకాలు చేపడతామని చెబుతూ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కరోనా కారణంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, బాధపడొద్దని కోరారు. దీంతో నిరుద్యోగులు శాంతించారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు.


More Telugu News