టాలీవుడ్ లో రేపు 24 క్రాఫ్ట్స్ సమావేశం... చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ
- ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సమావేశం
- చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సమావేశం
- హాజరుకానున్న చిరంజీవి, మోహన్ బాబు తదితరులు
- సమావేశానికి రానున్న మంచు విష్ణు
గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల కంటే ఇతర సమస్యలపైనే అధికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం టాలీవుడ్ లో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరవుతున్నారు. కరోనా పరిస్థితులు, చిత్రసీమలో సంక్షోభం, సినిమా టికెట్ల అంశం, థియేటర్లు, సినీ రంగంపై ఆధారపడిన వారి సమస్యలు ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగనుంది.
కాగా, ఈ సమావేశానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవి, సినీ పెద్దలు మురళీమోహన్, మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, దర్శకుల సంఘం, స్టూడియోల యజమానులు... ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న అన్ని రంగాల వారిని ఈ సమావేశానికి రావాలంటూ ఆహ్వానించారు. తెలుగు ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది.