ముగింపు ఘట్టానికి చేరిన మేడారం జాతర

  • గత నాలుగు రోజులుగా మేడారం జాతర
  • గద్దెల వద్ద గిరిజన పూజారుల సంప్రదాయ పూజలు
  • భక్తుల దర్శనాలు నిలిపివేత
  • వనప్రవేశం చేయనున్న సమ్మక్క, సారలమ్మ
ఈ నెల 16 నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న మేడారం జాతర ముగింపు దశకు చేరుకుంది. గత నాలుగురోజులుగా మేడారం జనసంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. ఈ సాయంత్రం మేడారంలో గద్దెల వద్ద గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు చేపట్టారు. దాంతో గద్దెల వద్ద భక్తుల దర్శనాలు నిలిపివేశారు.

మేడారం జాతర ముగియనుండడంతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మేడారం జాతరకు ఈ నాలుగు రోజుల్లో 1.3 కోట్ల మంది వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు.


More Telugu News