ప్రభుత్వ సలహాదారు సజ్జల కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం

  • కర్నూలు జిల్లాలో ఘటన
  • ఓ పెళ్లి కోసం వచ్చిన సజ్జల
  • ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
  • వెనుక వస్తున్న వాహనాలు ఢీకొన్న వైనం
  • సజ్జల సురక్షితం
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాన్వాయ్ కి కర్నూలు జిల్లాలో స్వల్ప ప్రమాదం సంభవించింది. ముందు వెళుతున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.

కర్నూలు జిల్లాలోని కృష్ణానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. కాన్వాయ్ లో ఉన్న సజ్జల సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సజ్జల ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు వచ్చారు.


More Telugu News