జగ్గారెడ్డి సమస్యపై రేవంత్ రెడ్డి స్పందన!
- రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డికి విభేదాలు
- పార్టీకి రాజీనామా చేస్తానన్న జగ్గారెడ్డి
- ఈ సమస్య టీ కప్పులో తుపాను వంటిదన్న రేవంత్
సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ కోవర్ట్ నంటూ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. అంతేకాదు మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెస్ గుంపులో లేనని చెప్పారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
జగ్గారెడ్డి అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది ఒక సమస్య అని అన్నారు. కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయని, అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదని అన్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. గోతికాడ నక్కల మాదిరి టీఆర్ఎస్ నేతలు ఆడే ఆటలు సాగవని చెప్పారు.