సీబీఐ విచారణను సజ్జల తప్పుపట్టడం బరితెగింపే: బొండా ఉమ
- వివేకా హత్యకు కారణం అవినాశ్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసింది
- హత్య చేసిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
- జగన్ పై నమ్మకం లేకే సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసిందని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. అయినా కూడా వైసీపీ నేతలు బొంకుతూనే ఉన్నారని విమర్శించారు. సీబీఐ విచారణను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టడం బరితెగింపేనని అన్నారు. హత్య చేయించిన వారిని, చేసిన వారిని కాపాడే ప్రయత్నాలను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని చెప్పారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిందని... అధికారంలోకి వచ్చిన వెంటనే వివేకాను రక్షించేందుకు సీబీఐ విచారణ వద్దని కోర్టులో పిటిషన్ వేశారని ఎద్దేవా చేశారు. జగన్ పై నమ్మకం లేకే వివేకా కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ వేసిందని చెప్పారు.