మొదటి బ్యాట్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బహూకరించిన లక్నో సూపర్ జెయింట్స్

  • ఐపీఎల్ లో ఈసారి రెండు కొత్త జట్లు
  • లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆర్పీఎస్జీ
  • సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన సంజీవ్ గోయెంకా, గంభీర్
ఐపీఎల్ పోటీల్లో ఇకపై 10 జట్లు పాల్గొంటుండడం తెలిసిందే. ఐపీఎల్ ఆవిర్భావం నుంచి 8 జట్లు పోటీపడుతుండగా, ఈ సీజన్ నుంచి అదనంగా మరో రెండు జట్లకు అవకాశం కల్పిస్తున్నారు. కొత్త జట్ల కోసం బిడ్డింగ్ లో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు అవకాశం దక్కించుకున్నాయి. లక్నో జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకుంది. తమ జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అని నామకరణం చేసింది.

కొత్త జట్టు, కొత్త సీజన్... ఎంతో ఆశాభావంతో ముందడుగు వేయాలని లక్నో ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధిపతి సంజీవ్ గోయెంకా, జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ నేడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఆయనకు జట్టు తరఫున మొదటి బ్యాట్ ను బహూకరించారు.

దీనికి సంబంధించిన ఫొటోను లక్నో సూపర్ జెయింట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఫ్రాంచైజీ తరఫున తొలి బ్యాట్ ను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బహూకరించామని, ఆయన తమ జట్టుకు మద్దతు ప్రకటించారని వెల్లడించింది.


More Telugu News