బ్యాటింగ్ వీర విహారం.. ఒకే ఇన్నింగ్స్ లో మూడు శతకాలు
- బీహారీ జట్టు ఆటగాడు షకీబుల్ గని
- మణిపూర్ తో మ్యాచులో 341 పరుగులు
- మొదటి మ్యాచులోనే ప్రపంచ రికార్డు
- మరో ఆటగాడు బాబుల్ కుమార్ రెండు శతకాలు
దేశవాళీ క్రికెట్లో ఓ బీహారీ కుర్రాడు బ్యాట్ తో వీర విహారం చేశాడు. బంతిని చితక్కొట్టాడు. ఒకే ఇన్నింగ్స్ లో మూడు శతకాలతో ప్రపంచ రికార్డును సృష్టించాడు. అతడే బీహార్ జట్టు సభ్యుడైన షకీబుల్ గని (22). కోల్ కతాలో మిజోరం జట్టుతో శుక్రవారం జరిగిన రంజీ ప్లేట్ మ్యాచ్ ఇందుకు వేదికైంది.
గనీకి ఇది ఫస్ట్ క్లాస్ ఆరంగేట్ర మ్యాచ్. అంటే అతడికి ఇది తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్. తానేంటో నిరూపించుకోవడానికి ఇదే మంచి తరుణం అనుకున్నాడో ఏమో కానీ, బ్యాటుతో పరుగుల వరద పారించాడు. 405 బంతులు ఆడి 341 పరుగులు రాబట్టాడు. 56 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు.
2018లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచులో మధ్యప్రదేశ్ ఆటగాడు అజయ్ రెహెరా సాధించిన 267 పరుగుల రికార్డును చెరిపేశాడు. ఆశ్చర్యకరం ఏమిటంటే గనీకి జోడీగా మరో క్రికెటర్ బాబుల్ కుమార్ సైతం 229 పరుగులు సాధించాడు. దీంతో బీహార్ తన తొలి ఇన్నింగ్స్ ను 686 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరంభ మ్యాచ్ లోనే మూడు శతకాలు సాధించిన తొలి క్రికెటర్ గా షకీబుల్ గనీ ప్రపంచ రికార్డును సాధించినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆటకు సంబంధించిన వీడియో క్లిప్ ను బీసీసీఐ ట్విట్టర్ లో ఉంచింది.
బీహార్ లోని మోతిహారి పట్టణానికి చెందిన షకీబుల్ గనీకి వారం క్రితమే వాళ్లమ్మ మూడు బ్యాట్ లను బహుమతిగా ఇచ్చిందట. తండ్రి మహమ్మద్ మన్నన్ గని స్పోర్ట్స్ గూడ్స్ షాపును స్థానికంగా నిర్వహిస్తున్నాడు.