మన దేశంలోనూ వెలుగులోకి ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ఇన్ఫెక్షన్ కేసులు
- వైరస్ స్ట్రెయిన్ లో అస్పష్టత
- డెల్టా, ఒమిక్రాన్ సహ సంక్రమణం గుర్తింపు
- పదికి పైగా కేసుల్లో ఈ వైరస్
- జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని ఇన్సాకాగ్ నిర్ణయం
కరోనాలో ఇదో కొత్త కోణం. కరోనాలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల లక్షణాలు కలగలిసిన కేసులు సైప్రస్, బ్రిటన్ లో వెలుగు చూడడం విన్నాం. ఈ కొత్త కేసులకు డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు. కానీ, ఇప్పుడు ఇవే మాదిరి కేసులు మన దేశంలోనూ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కేంద్రం అప్రమత్తం అయింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశోధనల బాధ్యతలు చూస్తే ఇన్సాకాగ్ శుక్రవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ‘‘నూతన డెల్టాక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు మన దేశంలో వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల ఉమ్మడి ఇన్ఫెక్షన్ కేసులు కొన్ని బయటపడ్డాయి. కొన్ని కేసులకు సంబంధించి స్ట్రెయిన్ స్పష్టత కాలేదు. లోతైన అధ్యయనం చేయగా, ఒమిక్రాన్, డెల్టా వైరస్ సహ సంక్రమణ కనిపించింది. ఇప్పటి వరకు ఇలా స్ట్రెయిన్ స్పష్టంగా లేని కేసులు 10కి పైగా వెలుగులోకి వచ్చాయి’’అని ఇన్సాకాగ్ సభ్యుడు ఒకరు తెలిపారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో నిఘాను తీవ్రతరం చేయాలని ఇన్సాకాగ్ నిర్ణయించింది. ప్రతి వారం కనీసం 10,000 కేసులకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ ఎలా ప్రవర్తిస్తోందన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచినట్టు ఇన్సాకాగ్ సభ్యుడు ఒకరు చెప్పారు. ఒక వ్యక్తి కరోనాకు సంబంధించి భిన్నమైన వేరియంట్ల ఇన్ఫెక్షన్ కు గురికావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే తెలిపింది.