ఆ క్యాచ్ లు పట్టి ఉంటే ఆట మరోలా ఉండేది.. విరాట్ ఇన్నింగ్స్ అద్భుతం: రోహిత్ శర్మ
- క్యాచులను వదిలేయడం పట్ల అసంతృప్తి
- విరాట్ నైపుణ్యాలపై నమ్మకం ఉంచాం
- అతడు నా ఒత్తిడిని తీసేశాడు
- పంత్, అయ్యర్ ఫినిషింగ్ బావుంది
వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో , భారత జట్టు చెత్త ఫీల్డింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. జట్టు సభ్యుల అలసత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 186 పరుగులు సాధించింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన వెస్టిండీస్ జట్టు గట్టిగానే పోరాడింది. నికోలస్ పూరన్ (62), రోవ్ మన్ పొవెల్ (68) ధాటిగా ఆడి భారీగా పరుగులు రాబట్టుకున్నారు. చివరికి ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఆసాంతం భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలు ఎత్తి చూపాయి. చాహల్, బిష్ణోయ్, అయ్యర్ క్యాచ్ లను జారవిడిచారు.
భారత ఫీల్డర్లు ఆ క్యాచులను పట్టి ఉంటే ఆట మరోలా ఉండేదని రోహిత్ శర్మ అన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ‘‘అనుభవం కీలక పాత్ర పోషించింది. అతడి టాలెంట్ ను మేము నమ్మాం. విరాట్ ఇన్నింగ్స్ ఎంతో కీలకమైనది. నా ఒత్తిడి అతడు తీసేసుకున్నాడు. పంత్, అయ్యర్ ఇచ్చిన ఫినిషింగ్ అద్భుతం’’అని రోహిత్ తెలిపాడు. అయ్యర్ కూడా మెచ్చుకున్నాడు.