ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 22,270 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న 60,298 మంది పేషెంట్స్
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,53,739
మన దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. నిన్న 25 వేలకు దిగొచ్చిన కొత్త కేసుల సంఖ్య ఈరోజు మరింత తగ్గింది. గత 24 గంటల్లో 22,270 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 1.8 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 60,298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు 4.28 కోట్ల మంది కరోనా బారిన పడగా... 4.20 కోట్ల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,11,230కి చేరుకుంది. ఇప్పటి వరకు 175.03 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 36 లక్షల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారు.