'ఖిలాడి' ఫస్టువీక్ లో రాబట్టిన వసూళ్లు ఇవే!
- ఈ నెల 11న వచ్చిన 'ఖిలాడి'
- తెలుగు రాష్ట్రాల్లో 10.33 కోట్ల షేర్
- ప్రపంచవ్యాప్తంగా 12.24 కోట్ల షేర్
- ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన వసూళ్లు
రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన 'ఖిలాడి' సినిమా, ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. తొలిరోజున ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఫరవాలేదు అనేశారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 4.80 కోట్ల షేర్ సాధించగా, ఆ తరువాత నుంచి వసూళ్లు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.
ఈ నెల 17వ తేదీతో ఈ సినిమా విడుదలై వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 3.79 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఆంధ్ర - తెలంగాణ ప్రాంతాల్లో ఈ వారం రోజుల్లో 10.33 కోట్ల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 12.24 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఈ సినిమా బిజినెస్ జరిగిన నెంబర్స్ కీ దగ్గరలో వసూళ్లు లేవని అంటున్నారు. హీరోయిన్స్ వైపు నుంచి ఈ సినిమాకి క్రేజ్ లోపించడం .. రవితేజ మార్క్ పాటలు పడకపోవడం .. ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో జరగకపోవడం .. ఆశించిన స్థాయి వసూళ్లను ఈ సినిమా అందుకోకపోవడానికి కారణాలుగా చెప్పుకుంటున్నారు.