పాదయాత్రకు సిద్ధమైన టీడీపీ నేత కోడెల శివరాం.. ఎన్టీఆర్ భవన్‌ను చుట్టుముట్టిన పోలీసులు
- రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర
- టీడీపీ నేతలు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం
- పార్టీ కార్యాలయంలోనే శివరాంను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర నేపథ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రన్న ఆశయ సాధన పేరుతో శివరాం నేడు రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావుతోపాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దేవరంపాడు కొండ వద్ద భోజన ఏర్పాట్లను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కోడెల శివరాం.. కాసేపటి క్రితం సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుని టీడీపీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రకు బయలుదేరిన శివరాంను పోలీసులు అడ్డుకుని పార్టీ కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేశారు.