టీమిండియాను భయపెట్టిన పూరన్, పావెల్.. భారత్‌దే టీ20 సిరీస్!
- 8 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్
- 2-0తో టీ20 సిరీస్ భారత్ కైవసం
- అర్ధ సెంచరీలతో చెలరేగిన పూరన్, పావెల్
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా రిషభ్ పంత్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో గతరాత్రి జరిగిన రెండో టీ20లో భారత్ అతి కష్టంపై విజయం సాధించి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఇప్పుడు అదే జోరు కొనసాగించి టీ20 సిరీస్‌ను కూడా చేజిక్కించుకుంది. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 187 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ తొలుత భయపెట్టింది.
వికెట్ కీపర్ నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ ఎడాపెడా బంతులను బౌండరీలకు తరలిస్తూ లక్ష్యం దిశగా దూసుకెళ్లారు. పూరన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, పావెల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశారు. వీరి దూకుడు చూస్తుంటే భారత్ ఓటమి ఖాయమని అనిపించింది. అయితే, 19వ ఓవర్ మూడో బంతికి పూరన్‌ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో విజయం విండీస్ చేజారింది. ఆ తర్వాత కెప్టెన్ పొలార్డ్ క్రీజులోకి వచ్చినప్పటికీ పరుగులు రాబట్టలేకపోయాడు. ఫలితంగా 178 పరుగుల వద్ద విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా రోహిత్ సేన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మాజీ సారథి కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా కోహ్లీ మునుపటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పంత్ కూడా చెలరేగిపోయాడు. మెరుపు అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, వెంకటేశ్ అయ్యర్ కూడా క్రీజులో ఉన్నంత సేపు బ్యాట్ ఝళిపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ 19 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (2), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టగా, కాట్రెల్, రొమరియో చెరో వికెట్ తీసుకున్నారు. రిషభ్ పంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి టీ20 రేపు (ఆదివారం) జరుగుతుంది.