కాంగ్రెస్ నేత వెంకట్ బల్మూరిపై గాడిద దొంగతనం కేసు

  • గత రాత్రి వెంకట్ బల్మూరి అరెస్ట్
  • గాడిదను దొంగతనం చేశాడంటూ అభియోగం
  • సోషల్ మీడియాలో వెల్లడించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూరిపై గాడిద దొంగతనం కేసు నమోదైంది. గాడిదను దొంగతనం చేశాడన్న ఆరోపణలపై వెంకట్ బల్మూరిని గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పోలీసుల నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలమని వ్యంగ్యం ప్రదర్శించారు. దీని గురించి మీరేం అనుకుంటున్నారు? అంటూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నెటిజన్లను ప్రశ్నించారు.


More Telugu News