ఎన్ఐఏ రహస్య పత్రాల లీకేజి కేసులో ఐపీఎస్ అధికారి అరెస్ట్

  • లష్కరే సంస్థకు పత్రాలు లీక్ చేసిన అరవింద్ నేగి
  • గతంలో ఎన్ఐఏలో పనిచేసిన నేగి
  • ప్రస్తుతం సిమ్లా ఎస్పీగా ఉన్న వైనం
రహస్య పత్రాల లీకేజి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. కొంతకాలం కిందట ఎన్ఐఏలోనే రహస్య పత్రాల లీకేజి ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు అరెస్టయింది కూడా గతంలో ఎన్ఐఏలో పనిచేసిన అధికారే. ఆయన పేరు అరవింద్ దిగ్విజయ్ నేగి. ఆయన గతంలో ఎన్ఐఏలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం సిమ్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. లష్కరే కార్యకలాపాలపై నమోదైన కేసులో భాగంగా ఆ అధికారిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

కాగా, లష్కరే నెట్ వర్క్ వ్యాప్తికి సంబంధించి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు గతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారి అరవింద్ నేగి అరెస్ట్ సందర్భంగా ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు జరిపారు. అధికారిక రహస్యపత్రాలను లష్కరే ఉగ్రవాద సంస్థకు లీక్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.


More Telugu News