అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధునిక కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన సీఎం జగన్

  • రూ.20 కోట్లతో ఆత్మకూరులో ఏర్పాటు
  • ‘జగనన్న గోరుముద్ద’కు భోజనం సరఫరా
  • అక్కడి వంటకాలను రుచి చూసిన సీఎం
ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక కిచెన్ ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రూ.20 కోట్లతో ఈ కిచెన్ ను ఏర్పాటు చేశారు. ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది. 2 గంటల్లో 50 వేల మందికి భోజనం అందించేలా ఈ కిచెన్ ను నిర్మించారు.

కాగా, కిచెన్ ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆ తర్వాత ఆయన కూడా భోజనాన్ని రుచి చూశారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలను సిద్ధం చేస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. సీఎం అక్కడ్నుంచి కొలనుకొండ వెళ్లి.. ఇస్కాన్ నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. రూ.70 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రాధాకృష్ణులు, వెంకటేశ్వరస్వామి ఆలయాలను అందులో నిర్మిస్తున్నారు. వాటితో పాటు ధ్యాన మందిరాలు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


More Telugu News