చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి క‌బ్జా?

  • నారావారిపల్లెలో ఘ‌ట‌న‌
  • చంద్ర‌బాబు త‌మ్ముడు రామ్మూర్తి నాయుడికి 38 సెంట్ల భూమి
  • అందులో ఓ వ్య‌క్తి ఫెన్సింగ్‌
 టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి స్వగ్రామం నారావారిపల్లెలో ఆయ‌న కుటుంబానికి సంబంధించిన భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి క‌బ్జా చేశారు. 1989లో సర్వే నంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని చంద్రబాబు తండ్రి నారా ఖర్జూరనాయుడు కొనుగోలు చేశారు. కొన్నేళ్ల త‌ర్వాత‌ ఆ భూమిలో కొంత భాగాన్ని చంద్ర‌బాబు, రామ్మూర్తి నాయుడికి పంచారు.

అయితే, త‌న వాటా భూమిని చంద్ర‌బాబు నాయుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, క‌ల్యాణ మండ‌పానికి విత‌ర‌ణ‌గా ఇచ్చారు. మిగతా 38 సెంట్ల భూమి చంద్ర‌బాబు త‌మ్ముడు రామ్మూర్తి నాయుడి పేరిట ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే, అదే గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి భూమిని కబ్జా చేసేందుకు రాతి కుసాలు నాటుతున్నారు. ఆ 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ వేయ‌డంతో వివాదం రాజుకుంది. ఆ భూమి రామ్మూర్తి నాయుడి పేరిట రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన‌ప్ప‌టికీ ఆన్ లైన్ లో ఆ వివ‌రాలు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో ఈ క‌బ్జాకు య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.


More Telugu News