బలగాలను మరింత పెంచింది.. మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయచ్చు: బైడెన్
- బలగాలు ఉపసంహరించుకున్నామన్న రష్యా
- ప్రకటనకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న అమెరికా
- కొత్తగా మరో 7 వేల మంది సైనికులు సరిహద్దుల వద్దకు
- రష్యా దాడి చేస్తే అందుకు వ్యతిరేకంగా భారత్ తమతో పాటు నిలుస్తుందన్న అమెరికా
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ భయం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నెల 16న దాడి చేస్తుందని అమెరికా ముందుగా చెప్పినప్పటికీ రష్యా ఆ చర్యకు పాల్పడలేదు.
అయినప్పటికీ ఉక్రెయిన్ కి రష్యాతో ముప్పు తగ్గలేదని అమెరికా చెబుతోంది. రష్యా సైనికులను ఉపసంహరించలేదని, అంతేగాక అదనంగా మరింతమందిని మోహరించారని నాటో దేశాలు కూడా చెబుతున్నాయి. రెండు-మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చెప్పారు.
ఉక్రెయిన్ సరిహద్దులో సైనికులను ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించినప్పటికీ, రష్యా ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదని బైడెన్ తెలిపారు. బయటి ప్రపంచాన్ని మభ్యపెట్టడానికే అటువంటి ప్రకటనలు చేస్తోందని చెప్పారు. ఉక్రెయిన్ సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించడానికి తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి పంపుతున్నానని బైడెన్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా ఒకవేళ దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా భారత్ తమ సరసన నిలుస్తుందని అమెరికా ఆశిస్తోంది. ఇప్పటికే భారత్ చతుర్భుజ కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సమావేశంలో సభ్యదేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో రష్యా, ఉక్రెయిన్‌ల గురించి చర్చ వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.
మరోవైపు, గత 48 గంటల్లో అదనంగా 7,000 మంది రష్యన్ సైనికులు సరిహద్దుకు తరలి వచ్చారని నాటో దేశాలు చెప్పాయి. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్క్స్, లుహాన్స్‌క్ ప్రాంతాల్లో కాల్పుల కలకలం చెలరేగింది. అక్కడి రష్యా అనుకూల వేర్పాటువాదులు, ఉక్రెయిన్ దళాలు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో అలజడి రేగింది.