వారికి ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదంటూ కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయాలి
- వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలి
- వారు కష్టపడి పనిచేస్తున్నారన్న బండి సంజయ్
తెలంగాణలో ఉన్న 12,765 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వారి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని, వారు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదని అన్నారు.